దేశవ్యాప్తంగా ఐటీ శాఖ దాడులు : ముంబయి, కోల్ కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్ లో దాడులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 08, 2019

దేశవ్యాప్తంగా ఐటీ శాఖ దాడులు : ముంబయి, కోల్ కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్ లో దాడులు

ఆదాయపన్నుశాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ముంబయి, కోల్ కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్, సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్ బ్రోకర్లు, వ్యాపారులపై శనివారం నాడు దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

కృత్రిమ లాభ, నష్టాల కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలో రివర్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వివాదాస్పద పద్దతి ద్వారా పలు యోగ్యత లేని సంస్థలు దాదాపు రూ.5500 కోట్లకు పైగా లాభ, నష్టాలను పొందాయని ఐటీ విభాగం అంచనా వేసింది. ఈ సోదాల్లో అధికారులు లెక్కల్లో చూపని నగదు దాదాపు రూ.1.20 కోట్లు సీజ్ చేసారు.

ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చని.. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆదాయపన్ను శాఖ తెలిపింది.


Post Top Ad