టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, గుంటూరు, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలోనూ  సీబీఐ అధికారులు సోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.