వేణుగాణం తో మైమరిచిపోయిన ఇస్రో మీటింగ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

వేణుగాణం తో మైమరిచిపోయిన ఇస్రో మీటింగ్


 భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో (ఇస్రో) జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకొంది. సమావేశం ముగింపు సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త తన వేణుగాన (ఫ్లూట్‌) ప్రదర్శనతో అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియోని కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ''ఇస్రోలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం వేణుగానంతో ముగిసింది. బెంగళూరులోని శాటిలైట్ సెంటర్‌ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ తన అద్భుతమైన వేణుగానంతో అందరిని ఆకట్టుకున్నారు. వేణుగానంలో ఆయన నిపుణుడు. వాతాపి గణపతిం భజే అనే పాటను ఆయన తన వేణుగానంతో ఎంతో చక్కగా వాయించారు'' అని జైరాం రమేష్‌ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్ శివన్‌, పలువురు ఎంపీలు హాజరయ్యారు. వారందరి సమక్షంలోనే కున్హికృష్ణన్ ఈ ప్రదర్శన చేశారు. కాగా ఈ వీడియో నెటింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కున్హికృష్ణన్ ప్రతిభను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )