హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్‌ టీమ్‌ : వుమెన్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఐజీ స్వాతి లక్రా - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 20, 2019

హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్‌ టీమ్‌ : వుమెన్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఐజీ స్వాతి లక్రా

రాష్ట్రంలో షీ–టీమ్‌ల పనితీరును మరింత బలోపేతం చేసే విషంగా  అన్ని జిల్లాల్లోని షీ–టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు అంశాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్‌ టీమ్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం కార్యాలయంలో గురువారం ఈ ప్రత్యేక షీ–టీమ్‌ విభాగాన్ని వుమెన్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. హైదరాబాద్‌లో క్యాబ్‌లను బుక్‌ చేసుకోగానే బుక్‌ చేసిన వారి సమాచారంతోపాటు క్యాబ్‌ ప్రయాణించే మార్గాన్ని తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామని స్వాతి లక్రా తెలిపారు.