కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను రక్షించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సైఫుద్దీన్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 22, 2019

కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను రక్షించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సైఫుద్దీన్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో  కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సైఫుద్దీన్‌ అప్రమత్తతకు మెచ్చిన ఉన్నతాధికారులు శనివారం అభినందించారు. ఈ నెల 18న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కదులుతుండగా అందులోంచి ఒక మహిళ దిగేందుకు ప్రయత్నించింది. రైలులో తమ బంధువులను ఎక్కించి తిరిగి సదరు మహిళ దిగే క్రమంలో రైలు వేగం పుంజుకుంది. ఫుట్‌పాత్‌ మీద కాలువేయబోయిన మహిళ బోగీ నుంచి జారి బోగీ, ప్లాట్‌ఫామ్‌ మధ్యన పడబోయింది. అదే ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మహిళ జారిపడుతున్న బోగీ వద్దకు పరుగున వెళ్లి ఆమెను పట్టుకుని ప్లాట్‌ఫామ్‌ మీదకు లాక్కొచ్చాడు. 
దీంతో రైలుబోగీ, ప్లాట్‌ఫామ్‌ అంచున నలిగిపోవాల్సిన మహిళ సురక్షితంగా బయటపడింది. సీసీ పుటేజీల ద్వారా సైఫుద్దీన్‌ అప్రమత్తతను గుర్తించిన అధికా రులు అతన్ని అభినందించారు.