టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకు తెలంగాణ హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 16, 2019

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకు తెలంగాణ హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్

 టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనకు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై.. కోర్టు 8 వారాల పాటు స్టే విధించింది. ఈ క్రమంలో రమేష్‌ బాబు.. జర్మనీ పౌరసత్వాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. రమేష్‌ బాబు రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.