వికారాబాదు అనంతగిరి కొండలను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా చేయలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 20, 2019

వికారాబాదు అనంతగిరి కొండలను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా చేయలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు

 వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్టను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎమ్మెల్యే  మెతుకు ఆనంద్‌ మరియు  సిక్కిం రాష్ట్రానికి చెందిన నిపుణులు తెలిపారు. ఈ    నివేదిక ను టూరిజం ఎండీకి అందజేస్తామని చెప్పారు.  ఇందులో భాగంగా సీఎం ఆదేశాలు అందుకున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి గత నెల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న సిక్కిం రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్‌ జోన్‌ ప్రతినిధులు పారాగ్లైడింగ్‌ ఏర్పాటుపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.