దిశా నిందితుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ పోలీసు శాఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 15, 2019

దిశా నిందితుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ పోలీసు శాఖ

దిశా నిందితుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ పోలీసు శాఖ.
దిశ కేసు నిందితుల మృతదేహాలు పాడవకుండా భద్రపరచడానికి ఖర్చు భారీగానే అవుతోంది. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాలను పాడవ్వకుండా ఎంబాల్మింగ్ చేస్తున్నారు. ఇందు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో పాటు ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది.సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ఇచ్చేంత వరకు మృతదేహాలను ఇలాగే భద్రపరచాల్సి ఉంది.ఒక్కో మృతదేహానికి రూ. 7500 విలువైన ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇస్తే మృతదేహం పాడవకుంటా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఇంజక్షన్లతో 4 నెలల పాటు మృతదేహాలను పాడవ్వకుండా చూడవచ్చని తెలిపారు. వారానికి ఒకసారి ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వీటిని ప్రత్యేకంగా తెప్పించి ఇస్తున్నారు.