పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 09, 2019

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్‌


న్యూఢిల్లి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్‌ విదేశీ రుణాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తమ సంస్థలో భారీ వాటాలను విదేశాలకు విక్రయిం చేందుకు సిద్ధమైంది.ఎయిర్‌టెల్‌లో రూ. 4900 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అదే జరిగితే దేశంలో పాత ప్రైవేట్‌ టెలికాం కంపెనీ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం సునిల్‌ భారతి మిట్టల్‌, ఆయన కుటుంబానికి భారతీ ఎయిర్‌టెల్‌లో 52 శాతం వాటాలుండగా.. విదేశీ ప్రమోట ర్లకు 21.46 శాంత వాటా ఉంది. పబ్లిక్‌ షేర్‌ 37 శాతం ఉంది. ఇటీవలి కాలంలో సంస్థ భారీ నష్టాలను చవిచూడటం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే సరైన మార్గమని సునిల్‌ భారతీ మిట్టల్‌ భావిస్తున్నారు. రూ.4900 కోట్లపెట్టుబడులు పెట్టేందుకు సింగ్‌టెల్‌తో పాటు ఇతర విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో ఈ విషయాన్ని సునిల్‌ మిట్టల్‌ ప్రభుత్వానికి తెలియజేశారు. మేజర్‌ వాటాను విక్ర యిస్తే భారతీ ఎయిర్‌ టెల్‌ విదేశీ కంపెనీగా మారిపోతుంది. ఈ నెలలోనే పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు రావొచ్చని సంస్థ భావిస్తోంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )