రాష్ట్ర ప్రభుత్వం కి జాతీయ స్థాయి అవార్డులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 20, 2019

రాష్ట్ర ప్రభుత్వం కి జాతీయ స్థాయి అవార్డులు

జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో  ఐదు అవార్డులను  రాష్ట్ర ప్రభుత్వం  సాధించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌ రావుతోపాటు పలువురు అధికారులు ఈ పురస్కారాలు అందుకున్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు గాను జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినందుకు ఓ అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని రఘునందన్‌రావు అందుకున్నారు. ప్రతిభ చూపిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జాతీయస్థాయిలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.