ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సర్కార్ 26 రకాల హామీలు : కోరిన దానికంటే ఒకరకంగా విలువైన నజరానాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సర్కార్ 26 రకాల హామీలు : కోరిన దానికంటే ఒకరకంగా విలువైన నజరానాలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో సమ్మె విరమించిన తర్వాత కొన్ని రోజుల వరకు విధుల్లో చేర్చుకునే అంశంపై స్పందించలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ఆర్టీసీ కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కేబినెట్లో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మకులకు ఎన్నో హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు 26 రకాల హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ఆర్టీసీ కార్మికులు అందరూ సంబరాల్లో మునిగి పోయి మళ్లీ విధుల్లో చేరి సజావుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
ఇప్పటికే ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక పెండింగ్లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఈ నెల 2వ తేదీన ఇవ్వనున్నట్టు తెలిపారు. 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన దినాల వేతనాలు కూడా చెల్లిస్తాం అంటూ కార్మికులకు కేసీఆర్ హామీ ఇచ్చి కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులందరినీ ఒక్కరిని కూడా ఉద్యోగం లోంచి తీసేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
మొత్తంగా 26 రకాల హామీలను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్యను అందింస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీ లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.


Post Top Ad