ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు


ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ ఫిక్స్ అయ్యి ఉంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు కొంత కాలంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఓ పార్టీ సమావేశంలో ముఖ్య నేతల ముందే ఈ గ్రూపు కట్టిన నేతలు మాటల వాగ్బానాలు సంధించారు. అంతేకాకుండా పార్టీ పరమైన గ్రామ, మండల కమిటీలను పూర్తి చేశారు. పట్టణ కమిటీని వేశారు. ఇక జిల్లా అధ్యక్షుని ఎన్నిక కూడా ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. మరోసారి పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పాయల శంకర్‌ శ్రేణుల బల సమీకరణ చేసుకుంటుండగా మరోవైపు సుహాసినిరెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పీఠంపై గురిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ విభేదాలకు కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో టికెట్ల లొల్లి నడుస్తోంది. పార్టీ నాయకుల మధ్య విభేదాలతో తమవర్గం వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు పోరు సాగుతోంది. సోమవారం పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాల నేపథ్యంలో ఎంపీ నోటి వెంట ఈ వ్యాఖ్యలకు కారణమైందని ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి మధ్య విభేదాల కారణంగానే పార్టీలో ఒక రకమైన భిన్నమైన వాతావరణం నెలకొందన్న అభిప్రాయం లేకపోలేదు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎంపీ వ్యాఖ్యలు పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి ఉండవచ్చనే చర్చ సాగుతుంది.