నుమాయిష్‌ కి రంగం సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 30, 2019

నుమాయిష్‌ కి రంగం సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్

నుమాయిష్‌ కి  రంగం సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ నెల  జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఈ మేరకు నుమాయిష్‌ వివరాలను మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు. జనవరి 1 నుంచి 46 రోజులపాటు జరిగే 80వ నుమాయిష్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్‌.సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.