మీడియా సమావేశం నిర్వహించిన హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 26, 2019

మీడియా సమావేశం నిర్వహించిన హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

 హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో తగ్గిన క్రైంరేటు, కేసుల వివరాలు, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో జరిగిన వివిధ సంస్కృత కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించామని సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ షీ టీం బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రంలో నిలిచిందని పేర్కొన్నారు. 14వేల మంది పోలీసులు ఈ ఏడాది(2019)లో పలు విధుల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. 2019 మొత్తంగా మూడు శాతం క్రైం రేటు తగ్గిందని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. అందులో భాగంగా ఐపీసీ కేసులు 15, 598 నమోదు చేశామని అయన చెప్పారు.శారీరక నేరాలు తొమ్మిది శాతం, ప్రాపర్టీ క్రైం రెండు శాతం, చైన్ స్నాచింగ్ దొంగతనాలులు 30 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 2019లో కోర్టుల్లో 42 శాతం క్రైం కేసుల్లో శిక్ష పడిందని తెలిపారు. రూ. 26 కోట్లకుపైగా నగదు, ప్రాపర్టీ సీజ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. నాలుగు వందలకుపైగా చిన్న పిల్లలను పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. 2019 ఏడాదిలో ఆటో మొబైల్ కేసులు 17 శాతం పెరిగాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.