తెరాస పార్టీలోకి చేరికలు : భారీ సంఖ్యలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 29, 2019

తెరాస పార్టీలోకి చేరికలు : భారీ సంఖ్యలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు

తెరాస పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి . శనివారం ఆయా జిల్లాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై గులాబీ జెండా కప్పుకొంటున్నట్టు పలువురు నాయకులు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుతో ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వైపున్నట్టు నిరూపించారని మత్రి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కాంగ్రె స్‌ నియోజకవర్గ ఇంచార్జి అనంతరెడ్డితోపాటు వంద మంది నాయకులు, కార్యకర్తలు ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.