ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరాను నిలిపి వేయనున్న జీహెచ్‌ఎంసీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, December 21, 2019

ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరాను నిలిపి వేయనున్న జీహెచ్‌ఎంసీనగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరానుజీహెచ్‌ఎంసీ డిసెంబర్‌ 31 నుంచినిలిపివేయనుంది. శివార్లలోని ఎల్‌బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి,మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్‌చెరు తదితర సర్కిళ్ల పరిధిలో జీహెచ్‌ఎంసీ రోజుకు దాదాపు 350 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. జలమండలి ద్వారా ట్యాంకర్లను పంపిస్తూ వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తోంది. గతంలో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు లేనప్పుడు అమల్లోకి తెచ్చిన  ఈ విధానం.. అక్కడ నీటి సరఫరా లైన్లు వచ్చాక కూడా నీటి సరఫరా సదుపాయం లేని కొన్ని ప్రాంతాలు, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు,మురికివాడల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కొనసాగిస్తున్నారు. ఖర్చు జీహెచ్‌ఎంసీ భరిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకరి పేరు చెప్పి, మరొకరికి విక్రయించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఉచిత సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు.