పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌పై విరుచుకు పడ్డ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 30, 2019

పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌పై విరుచుకు పడ్డ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తిరంగా ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు.. ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్ క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అవినీతిలో కూరుకుపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సీసీగా ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )