ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, December 27, 2019

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈయనతోపాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. మంత్రులిద్దరూ సికింద్రాబాద్ జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రదేశానికి ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అన్ని చోట్లకు సరకు రవాణా చేసేందుకు వ్యవస్థ సిద్ధమైందని పేర్కొన్నారు.
మరోవైపు ఉద్యోగులకు సౌకర్యాల కల్పనలో భాగంగా, పనితీరు అంత బాగా లేని బస్సులను మరుగుదొడ్లుగా మార్చారు. సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు, ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్‌‌కు సిబ్బంది విన్నవించగా ఆయన ఇందుకు అంగీకరించారు. ఈ మేరకు డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )