రాజన్న సిరిసిల్ల పర్యటనలో తెలంగాణ సిఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 30, 2019

రాజన్న సిరిసిల్ల పర్యటనలో తెలంగాణ సిఎం కేసీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపర్యటించనున్నారు. 
ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి 10:30 గంటలకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్‌ మానేరు డ్యామ్‌ పరిశీలన కోసం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్‌ మానేరు నుంచి బయలుదేరి ఒంటి గంటకు కరీంనగర్‌ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు.  తర్వాత  మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.