దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేదిస్తాం : తెలంగాణ పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, December 18, 2019

దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేదిస్తాం : తెలంగాణ పోలీసులు

దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేదిస్తాం అని  తెలంగాణ  పోలీసులు తెలిపారు .  అయితే డీఎన్‌ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేసుల్లో ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డీఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఆధారాలు  సేకరిస్తున్నారు. నిందితులు డీఎన్‌ఏతో గత హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ​కాగా దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌ లో మృతి చెందిన విషయం తెలిసిందే.  ఎన్‌కౌంటర్‌పై కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.