బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది : తెలంగాణ సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది : తెలంగాణ సీఎం కేసీఆర్


సోమవారం శ్రీరాజరాజేశ్వర (మధ్య మానేరు) జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా సందర్శించారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వద్ద మానేరుపై నిర్మించిన బ్రిడ్జిపై కొద్దిసేపు ఆగారు. సముద్రాన్ని తలపిస్తున్నట్టు ఉన్న ఎస్సారార్‌ బ్యాక్‌వాటర్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. 
తాను కలలుగన్న తెలంగాణ ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నదని, హృదయపూర్వక సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మిడ్‌మానేరు ప్రాజెక్టుపై నిలబడి పూజచేస్తున్నప్పుడు గొప్ప సాఫల్యత సాధించిన భావనకు గురయ్యానన్నారు. శభాష్‌పల్లి వంతెనపై తన కాన్వాయ్‌ని నిలిపిన సమయంలో ప్రాజెక్టు నీళ్లను తనివితీరా చూశారు. బ్రిడ్జికి ఇరువైపులా కనుచూపు మేర నీరు కనిపించడంతో ఉప్పొంగిపోయారు. ఈ సమయంలో తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలనుద్దేశించి.. ‘నేను కలలుగన్న తెలంగాణ కండ్లముందు కనిపిస్తున్నది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )