గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసిన CM కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, December 31, 2019

గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేసిన CM కేసీఆర్

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్‌చైర్మన్‌ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు.
కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్‌ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్‌ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్‌ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి.