హార్యానలో లో జరిగిన NIC క్యాంప్ లో ప్రసంగిచిన తెలంగాణ‌ వాసి కుమార్ యాదవ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, December 12, 2019

హార్యానలో లో జరిగిన NIC క్యాంప్ లో ప్రసంగిచిన తెలంగాణ‌ వాసి కుమార్ యాదవ్

కూకట్‌పల్లి ప్రతినిధి: హర్యానా రాష్ట్రం, కురుక్షేత్ర లో దాదాపు 5 రోజుల పాటు జరిగే క్యాంప్ లో రాష్ట్రం నుండి ఎన్నికైన కుమార్ యాదవ్ వివిధ రాష్ట్రాల యువతను ఉద్దేశించి ప్రసంగించారు. NIC క్యాంప్ నిర్వహిస్తున్న హర్యానా వారికి ధన్యవాదాలు తెలిపారు.
    ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్, రాష్ట్రాలు వేరైనా,భాష వేరైనా మనమంతా భారతీయులం అని, తెలంగాణ రాష్ట్రం లో ప్రపంచంలో ఏ మూల నుండి వచ్చిన, ఎక్కడినుండి వచ్చినవారైన బ్రతికే స్వేచ్ఛను కల్పించే సంస్కృతి మనదని, అన్ని రకాల వారికి అనుకూలంగా వుండే ప్రాంతం, జానపద కలలకు నిలయం ,విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రుచులు కలిగిన రాష్ట్రం తెలంగాణ.  తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలో తెలంగాణకు ఉన్న చరిత్ర  ఏ దేశానికి కూడా లేదు అని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1200 మంది ప్రాణ త్యాగాలు చేసి సాదించుకున్నాం.దేశ స్వాతంత్ర్య పోరాటం లో దేశం కోసం త్యాగాలు చేస్తే మేము స్వరాష్టం కోసం ప్రాణ త్యాగాలు చేసినము అన్నారు. 1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నైజందొర గడిలాలో బందీలుగా ఉండి స్వాతంత్ర్యము కోసం పోరాటం సాగిస్తున్నారూ అన్నారు. 1948 సెప్టెంబర్ 17 వ రోజున నైజం నుండి తెలంగాణకు విముక్తి దొరికింది అన్నారు. తరువాత పరిణామాల వలన మళ్ళీ సమాఖ్య పాలనలో మోసపోయి  మలిదశ ఉద్యమాలు సాగించి 2014 న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను, సంస్కృతి, బాషా, యాస ను వివిధ రాష్ట్రాల యువతకు తెలిపే అవకాశం కల్పించిన కేంద్ర యువజన శాఖ కు ధన్యవాదాలు తెలిపారు.