ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ పెద్ద సాహస౦ చేస్తున్నాడట. కొన్ని యుద్ద సన్నివేశాల్లో గుండు తో కనపడే విధంగా నటిస్తున్నాడట. ఆ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు తారక్ ఫోటో కూడా బయటకు వచ్చే అవకాశం లేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కొమరం భీమ్ గెటప్ లో లీక్ అయిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.