రాష్ట్రంలో త్వరలో జరిగే పురపాలక ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారని కేటీఆర్ అన్నారు. వీరంతా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్ల పాలనలో మేం ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ప్రజలు అభీష్టానికి అనుగుణంగా కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేలా పనిచేశాం. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం తీసుకొచ్చాం. ఈ పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చాక 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది.’’ అని కేటీఆర్ అన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )