ఈ నెల 10న (శుక్రవారం) హైదరాబాద్లో మరో భారీ ర్యాలీ : ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఏఐఎంఐఎం పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు వాటికి వ్యతిరేకంగా ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి దేశ వ్యాప్తంగా నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) హైదరాబాద్లో మరో భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టినట్లు చెప్పారు. జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితమే మిలియన్ మార్చి పేరుతో నగరంలో వేలాది మంది ట్యాంక్ బండ్పై ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనివల్ల నగరంలో ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అబిడ్స్, ఎల్బీ స్టేడియం, నాంపల్లి వంటి చోట్ల భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Post Top Ad
Tuesday, January 07, 2020
హైదరాబాద్ లో 10 న మరో భారీ ర్యాలీ
Admin Details
Subha Telangana News