ఈవ్ టీజింగ్, మహిళలపై జరిగే దాడులను నివారించడంలో ప్రభుత్వం విజయవంతమవుతున్నది. 2014లోనే షీ టీమ్స్ ఏర్పాటుచేశారు. మొత్తం 200 షీ టీమ్‌లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. మహిళా సాధికారతకు ప్రభు త్వం వీ హబ్‌ను ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 30 మహిళా డిగ్రీ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. మహిళాసంఘాల్లో సభ్యులకు రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. స్త్రీ నిధి కింద గతేడాది రూ. 8 వేల కోట్లు ఇవ్వగా... ఈ ఏడాది రూ. 5 వేల కోట్లను రుణంగా ఇచ్చారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )