తెలంగాణ మున్సిపల్ ఎన్నికల లో 123 చైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల లో 123 చైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలో కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఆదివారం ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 128 మున్సిపాలిటీలు ఉండగా.. 123 చైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారుచేశారు. చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లలో బీసీలకు 33% కేటాయించారు. దీనిప్రకారం 40 మున్సిపాలిటీలు బీసీలకు దక్కాయి. కార్పొరేషన్లలోనూ నాలుగు (31%) మేయర్‌ స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీల్లో ఎస్సీలకు 17, ఎస్టీలకు 4, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. కార్పొరేషన్లలో బీసీలకు 04, జనరల్‌కు 7 రిజర్వ్‌కాగా.. మీర్‌పేట మేయర్‌ పదవి ఎస్టీకి, రామగుండం ఎస్సీకి కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ.. ఓటరు జాబితా ప్రకారం బీసీ రిజర్వేషన్‌ ఖరారు చేశారు.