గ్రామీణ ప్రాంతాల్లో 1,280 బస్సుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్న TSRTC - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

గ్రామీణ ప్రాంతాల్లో 1,280 బస్సుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్న TSRTC

ర్టీసీలో భారీగా బస్సుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్‌లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వెరసి 2,080 బస్సులు తగ్గిపోతున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్రంపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. తాజా నిర్ణయంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.