సంఘ విద్రోహులకు చెక్ : స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

సంఘ విద్రోహులకు చెక్ : స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలు


సంఘ విద్రోహులకు చెక్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్‌ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల నోడల్‌ అధికారుల గురువారం స్ట్రాంగ్‌ రూంకు తరలించారు.  అడిషనల్‌ డీజీ జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్‌ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 9, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 11 స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad