ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు జరిమానా విధించిన జీహెచ్ఎంసి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు జరిమానా విధించిన జీహెచ్ఎంసి

న‌గ‌రాన్ని స్వ‌చ్ఛ‌తతో, ప‌రిశుభ్రంగా ఉంచ‌డ‌మే జీహెచ్ఎంసి లక్ష్య‌మ‌ని వెల్లడించారు. రూల్స్ బేక్ చేసిన ఘ‌ట‌న‌లపై సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ విభాగం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ రూపొందించిన ప్ర‌త్యేక యాప్ ద్వారా పౌరులు సామాజిక బాధ్య‌త‌తో ఇటువంటి వాటిపై ఫోటోల‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 44వేల 403 అతిక్ర‌మ‌ణ‌ల ఫోటోల‌ను సీఈసీ మొబైల్ యాప్ ద్వారా అందిన‌ట్లు తెలిపారు. ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు విధించింది జీహెచ్ఎంసి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ & డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి ప్ర‌క‌ట‌న‌లో తెలియజేశారు. అన్ అఫీషియల్ ఫ్లెక్సీలు, క‌టౌట్లు, వాల్‌పోస్ట‌ర్లు ఏర్పాటు, నాలాలు, రోడ్ల‌పై చెత్త‌చెదారం డంపింగ్ చేసిన కంపెనీలపైనా, వ్య‌క్తుల‌పైనా భారీ ఎత్తున జ‌రిమానాలు విధిస్తున్న‌ట్లు తెలిపారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )