బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’వేదికగా హైదరాబాద్ కేంద్రంగా వచ్చే నెలలో జరిగే ఈ సదస్సులో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా బయో ఏసియా వేదికపై 75 స్టార్టప్‌లకు తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు 300 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక ‘బయో ఏసియా 2020’సదస్సు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరగనుంది. 75 స్టార్టప్‌లకు ఈ అవకాశం దక్కనుండగా, వీటి నుంచి ఎంపిక చేసిన ఐదు అత్యుత్తమ స్టార్టప్‌లకు పెట్టుబడుదారులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది. బయో ఏసియా సదస్సులో భాగంగా జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఎంపిక చేసిన స్టార్టప్‌లకు కల్పిస్తారు.
Post Top Ad
Thursday, January 09, 2020
బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’వేదికగా హైదరాబాద్
Admin Details
Subha Telangana News