ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పెన్నా సిమెంట్స్ కేసు కూడా ఒకటి. అనంతపురం జిల్లాలో పెన్నాకు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల లీజుల మంజూరులో అప్పటి మంత్రులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అనుబంధ ఛార్జిషీటులో పేర్కొంది. దీనిపై తొలుత దాఖలైన ఛార్జిషీటుకు కొనసాగింపుగా అనుబంధ ఛార్జిషీటును సీబీఐ 2016లోనే దాఖలు చేసింది. అయితే, దీనిపై హైకోర్టు అప్పట్లో స్టే విధించింది. తాజాగా స్టే ఎత్తేయడంతో దీన్ని విచారణకు స్వీకరించింది.పెన్నా సిమెంట్స్ కేసులో అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ మంత్రి ధర్మానకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరితోపాటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ అయ్యాయి. పెన్నా సిమెంట్స్ కేసులో ఈ నెల 17న హాజరుకావాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటును పరిగణించవద్దని జగన్ గతంలోనే కోరగా.. వీరి వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.
Post Top Ad
Friday, January 10, 2020
మంత్రి సబితకు సీబీఐ కోర్టు సమన్లు.. 17న కోర్టు ముందు హాజరుకు ఆదేశాలు
Admin Details
Subha Telangana News