ఈనెల 2నుంచి 12వ తేదీవరకు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగనుంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచే లా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. తొలి రోజు గ్రామ సభ నిర్వహించి.. మొదటి విడతలో చేపట్టిన పనులు, చేసిన చెల్లింపు వివరాలను ప్రజల ముందుంచనుంది. అలాగే సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, దాతల విరాళాల సమాచారాన్ని గ్రామస్తులకు చదివి వినిపించనుంది. పచ్చదనం–పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పల్లె ప్రగతి రెండో విడతలోనూ దీనికే పెద్దపీట వేస్తోంది. సెప్టెంబర్లో 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పల్లెసీమలను ప్రగతిబాట పట్టించాలని భావిస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )Post Top Ad
Wednesday, January 01, 2020
రేపటి నుండి మొదలు కానున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం
Admin Details
Subha Telangana News