అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 2020–23 కాలానికి ఫీజు ఖరారు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 2020–23 కాలానికి ఫీజు ఖరారు

తెలంగాణ లోని పలు  ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సహా మెడికల్‌ పీజీ, ఇతర సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజు పెంపునకు సన్నాహాలు మొదలయ్యాయి. మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీచేసింది. 
అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 2020–23 కాలానికి ఫీజు ఖరారుకు సంబంధించి గత మూడేళ్ల తమ ఆడిట్‌ ఆర్థిక నివేదికలను సమర్పించాలని కోరింది. ఆడిట్‌ ఆర్థిక నివేదికలతోపాటు ఆన్‌లైన్‌ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 31 అని తెలిపింది.