భైంసాలో బాధితులకు అండగా దీక్ష చేయనున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

భైంసాలో బాధితులకు అండగా దీక్ష చేయనున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. నిజామాబాద్ మేయర్ స్థానాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. గురుకులాల్లో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు. భైంసాలో హిందువులపై దాడి జరిగితే.. బాధితులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదని.. దాడికి నిరసనగా శనివారం 24 గంటల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. కార్పోరేషన్‌పై జెండా ఎగరవేస్తే.. కమిషన్లు ఉండవని.. అభివృద్ధి నిధులు పక్కదారి పోకుండా చూస్తామన్నారు. ఇరవై ఏళ్లలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చూపిస్తానని.. బీజేపీ మేయర్ పీఠం గెలిచిన వెంటనే తొలి సంతకం నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ తీర్మానం చేస్తామన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )