రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి


  హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లికి చెందిన చింతకాయల రాజు  తన ఇంటి నిర్మాణం కోసం పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు కావాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ కోరాడు. దీంతో రాజు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రశేఖర్‌కు రూ.25వేలు డబ్బులు ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు కార్యాలయంలోకి వచ్చి చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఇంటి నిర్మాణ అనుమతులకు లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. పంచాయతీ కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )