‘సీఏఏకు వ్యతిరేకంగా జనవరి 25న హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

‘సీఏఏకు వ్యతిరేకంగా జనవరి 25న హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి విమర్శించారు. సీఏఏను అడ్డుపెట్టుకొని దేశంలోని హిందూ, ముస్లింలను విభజించేందుకు ప్రధాని మోదీ, మంత్రి అమిత్‌ షా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అండేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన.. అంబేడ్కర్‌, నెహ్రూ, గాంధీలకు రాలేదని.. ఇంత ‘గొప్ప పని’ చేయాలని ప్రధాని మోదీకే ఆలోచన వచ్చిందని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో అసదుద్దీన్ మాట్లాడారు.
‘‘సీఏఏకు వ్యతిరేకంగా జనవరి 25న హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాం. అదే రోజు రాత్రి 12 గంటలకు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. సీఏఏకు వ్యతిరేకంగా జనవరి 26కు ముందే ప్రతి ఒక్కరు.. భారత రాజ్యాంగంలోని పీఠికను చదువుతున్న వీడియోను రూపొందించి, మేరా సంవిధాన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయండి.’’ అని ఒవైసీ పిలుపునిచ్చారు.