తెలంగాణ లో ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

తెలంగాణ లో ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక


రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. పలు మున్సిపాలిటీల్లో సగటున 80 శాతం నుంచి 90 శాతం వరకు పట్టణ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. కొన్ని వార్డుల్లో 90 శాతానికి పైబడి పోలింగ్‌ నమోదైంది. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సగటున 70.26 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. జిల్లాల్లోని మున్సిపాలిటీలతో పోలిస్తే.. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో పోలింగ్‌శాతం కొంతమేర తక్కువగా నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 93.31 శాతం ఓట్లు పోలవగా.. అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును ఈ నెల 25న జారీ చేయనున్నారు అధికారులు. 



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad