తెలంగాణ మొత్తంగా 30,721 కోట్లు వ్యవసాయ రుణాలు… 40.49 లక్షల మంది రైతులకు లబ్ది - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

తెలంగాణ మొత్తంగా 30,721 కోట్లు వ్యవసాయ రుణాలు… 40.49 లక్షల మంది రైతులకు లబ్ది

రైతులు రుణాలు రెన్యువల్ చేసుకుంటే నేరుగా వారికే ప్రభుత్వం నుంచి సొమ్ము ఇస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే అది చెక్కుల రూపంలోనా? మరొక రకంగా ఇస్తారా అనేది స్పష్టత లేదు. బ్యాంకులు మాత్రం రైతు ఖాతాకు జమ చేయాలని సూచిస్తున్నాయి. అయితే 2014లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రుణమాఫీ చేసినపుడు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏండ్ల లోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయస్సు ఉంటే మరొక కుటుంబంగా గుర్తించారు. 2014 రుణమాఫీలో భాగం గా 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను బ్యాంకు ఖాతాలకు పంపి మాఫీ చేశారు. మొదటి విడత 201415లో రూ.4,040 కోట్లు, రెండో విడత 201516లోనూ రూ.4,040 కోట్లు, 2016 17లో మూడో విడత రూ.4,025 కోట్లు, నాలు గో విడత 201718లో రూ. 4,033 కోట్లు మాఫీ చేసింది. ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్ప ష్టత లేదు. కుటుంబం యూనిట్‌గా పరిగణిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. గతంలో సోషల్ ఆడిట్ చేశారు. ఇప్పుడు దానికి బదులు సెల్ఫ్ డిక్లరేషన్ అనే ప్రక్రియను అమలు చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. బాకీని ధ్రువీకరిస్తూ లిఖితపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవాలని , అక్రమాలేమైనా జరిగితే రైతులనే బాధ్యులను చేయొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది.