నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన నివేదికను జనవరి 31 నాటికి... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 13, 2020

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన నివేదికను జనవరి 31 నాటికి...


హైదరాబాద్ ఘనవ్యర్ధాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ , నది ప్రవాహాలలో కాలుష్యం, ఎస్టీపీల నిర్మాణం, వ్యర్థజలాల శుద్ధీకరణ తదితర ఆంశాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన నివేదికను జనవరి 31 నాటికి అందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు.ఎన్‌జీటీ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సోమవారం బిఆర్‌కే భవన్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెట్రో వాటర్ వర్క్స మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, పీసీబీ సభ్య కార్యదర్శి తూ ప్రసాద్, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.