ఒక్కరాత్రిలో రికార్డు నెలకొల్పిన జనాలు : 3148 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 01, 2020

ఒక్కరాత్రిలో రికార్డు నెలకొల్పిన జనాలు : 3148 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

నూతన సంవత్సరం దృష్ట్యా   డిసెంబర్‌ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 239 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో  951  కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 3148 కేసులు నమోదయ్యాయని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని వివరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.   డిసెంబర్‌ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 239 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో  951  కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 3148 కేసులు నమోదయ్యాయని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని వివరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.