వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌


స్విట్జర్లాండ్ లోని దావోస్‌ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం 50వ వార్షిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈవోడీబీతో పాటు కాస్ట్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తగ్గింపు, క్వాలిటీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్‌ తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే… ఇన్నోవేషన్‌, ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌, ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌.. అనే త్రీ ఐ మంత్ర పాటించాలని కేటీఆర్‌ సూచించారు. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ప్రతిపాదించిన 102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో … తెలంగాణకు తగిన ప్రాధాన్యం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.