66 తులాల బంగారం, 3.74 కేజీల వెండి ఆభరణాలను అపహరించిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

66 తులాల బంగారం, 3.74 కేజీల వెండి ఆభరణాలను అపహరించిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి :జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఈ నెల 31 జరిగిన చోరీ  కేసును చేధించిన పోలీసులు. ఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్ ఆధారంగా కేసును చేధించిన‌ పోలీసులు. నిందితులు మేడ్చల్ వాసులని తెపిపారు. నిందితులలో తునా సంజయ్ సింగ్ అలియాస్ టమాటో సంజయ్ , మనీష్  ఉపాధ్యాయ, ప్రదీప్ శ్యామ్లు ఉన్నారు. వారిని అరెస్టు చేశారు.


నిందితుల వద్ద నుంచి 66 తులాల బంగారం, 3.74 కేజీల వెండి ఆభరణాలు, రూ. 5,650 నగదు, ఒక డెల్ ల్యాప్‌టాప్, సోనీ హ్యండ్ కెమెరా, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం . ప్రధాన నిందితుడి తునా సంజయ్ సింగ్ పై 8 కేసులు ఉన్నాయి, నేరెడ్ మెట్, బేగంపేట,  చిలకలగూడ పోలీస్ స్టేషన పరిధిలో కేసులున్నాయి
మనీష్ పై గతంలో ఆరు కేసులు ఉన్నాయి.
సంజయ్ సింగ్ గతంలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చి మళ్ళి చోరీలకు పాల్పడుతున్నాడు.
 కెేసు ఛేదనలో చురుగ్గా స్పందించి.
నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన ఫింగర్ ప్రింట్ బృందం ,పోలీసులకు రివార్డులు అందించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్.