ముగిసిన తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ : 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 22, 2020

ముగిసిన తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ : 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది . 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.  5 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. అత్యధికంగా ఆదిభట్లలో అత్యల్పంగా నిజాంపేటలో పోలింగ్‌ నమోదు. ఈనెల 25న ఎన్నికల లెక్కింపుజరగనుంది.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీ సమేతంగా వచ్చి  22 వార్డులో ఓటు  హక్కు  వినియోగించుకున్నారు.అందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు నుండి ఎంపీడీఓ కార్యాలయ పోలింగ్ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద చనిపోయిన వ్యక్తి ఓటు వేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ. చోటుచేసుకుంది.