కూకట్‌పల్లి కోర్టులో లంచం ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ మదన్ మోహన్, అరుణ్ కుమార్ లు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

కూకట్‌పల్లి కోర్టులో లంచం ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ మదన్ మోహన్, అరుణ్ కుమార్ లు


లంచం తీసుకుంటూ ఇద్దరు కూకట్‌పల్లి సివిల్‌ కోర్టు సిబ్బంది అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా అరుణ్‌, మదన్‌మోహన్‌లను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కోర్టు ఆర్డర్‌ ఇవ్వడానికి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ సిబ్బంది అవినీతి చేపలను లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.