ఈ రోజు, రేపు తెలంగాణ లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 01, 2020

ఈ రోజు, రేపు తెలంగాణ లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం

ఈ రోజు, రేపు తెలంగాణ లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం.  ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అలాగే గురువారం కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.