ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. దావోస్‌లో రెండో రోజైన బుధవారం (జనవరి 22) బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్‌లో గూగుల్ కార్యకలాపాలు, విస్తరణపై ఆయనతో చర్చించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ ‘బీఏఈ’ ఛైర్మన్ సర్ రోజర్ కార్.. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి డిఫెన్స్, ఏరోస్పేస్ ప్రాధాన్య రంగాలని ఈ సందర్భంగా రోజర్ కార్కు కేటీఆర్ తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )