పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీసీఐ, సీఎన్‌బీసీ టీవీ-18 ఆధ్వర్యంలో పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై జరిగిన కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని, పలు రంగాలు పురోగతిని సాధిస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంగళవారం తెలంగాణ పెవిలియన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. సింగపూర్ ఐటీ, వాణిజ్య వ్యవహారాల మంత్రి ఈశ్వరన్, పారిశ్రామిక సంస్థల అధిపతులు, సీఈవోలు తదితరులతో భేటీ అయ్యారు. పిరమిల్ గ్రూపు ఛైర్మన్ అజయ్ పిరమిల్‌ను కలిశారు. అపోలో టైర్స్, కార్ల్స్ బెర్గ్ గ్రూప్, హెచ్‌పీ, పీఅండ్ జీ తదితర దిగ్గజ సంస్థల ఛైర్మన్లు, సీఈవోలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయా రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )