అన్ని దానలకన్న విద్య దానం గొప్పది.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

అన్ని దానలకన్న విద్య దానం గొప్పది.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్


నారాయణ ఖేడ్ మండల పరిధిలోని
లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు నీరుడి మాణిక్యం & సావిత్రి గత కొన్ని రోజుల క్రితం ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు మృతి చెందారు. వీరి   సంతానమైన మహేశ్వరికి మమత కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బాచేపల్లి, హైద్రాబాద్ నందు BSC నర్సింగ్ లో మెరాడ్ సీట్ వచ్చింది. హాస్టల్ కి మొదటి సంవత్సర చదువునిమితమై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & స్వామి వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ 20వేలు బిజ్జమ్ చారటబుల్ ట్రస్ట్ వెవస్థాపకులు బిజ్జమ్ వెంకటేశ్వర్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా 10వేలు బాలిక మేనమామ సంగమేష్ తో కలసి మమత సైన్స్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ నర్సింగ్) బాచూపల్లి లో కాలేజ్ యాజమాన్యంనికి మహేశ్వరి చదువు నిమిత్తం మై చెక్కులు అందజేశారు. మిగితా  నాలుగు సంవత్సరాల చదువుకు దాతల సహకారంతో పూర్తి చేస్తామని హామీఇచ్చారు. అలాగే బాలిక మేనమామ సంగమేష్ వారి కుటుంబ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మరియు వెంకటేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.